YS Vijayamma: వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా.. తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటా..

YS Vijayamma: వక్రీకరణకు తావులేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా

Rama Rao
Updated on: 8 July 2022 3:54 PM IST
YS Vijayamma Resigned From the YCP President Post | AP News
X

YS Vijayamma: వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా.. తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటా..

YS Vijayamma: వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా తాను గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు విజయమ్మ ప్రకటన చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఒంటరి పోరాటం చేస్తోందని ఆమెకు అండగా ఉంటానని విజయమ్మ తెలిపారు. తల్లిగా తన బిడ్డలు ఇద్దరికీ అండగా ఉంటానని చెప్పారు.

షర్మిల, జగన్ వేర్వేరు రాష్ట్రాల్లో, వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారని విజయమ్మ చెప్పారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని ఆమె తెలిపారు. వక్రీకరణలు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే తాను వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను అనుకోలేదని విజయమ్మ చెప్పారు.

తన కొడుకు కష్టాల్లో ఉన్న తాను అండగా ఉన్నానని ఇప్పుడు షర్మిల కష్టాల్లో ఉంది కాబట్టి, తమ కుమార్తెకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని విజయమ్మ తెలిపారు. తండ్రి ఆశయం కోసం షర్మిల ఒంటరి పోరాటం చేస్తోందనని ఆమెకు అండగా ఉండేందుకే తాను వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని విజయమ్మ చెప్పారు.


Rama Rao

Rama Rao

Next Story