YS Sunitha: కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు వైఎస్‌ సునీత లేఖ

YS Sunitha: వివేకా హత్య కేసు నిందితులతో ప్రాణహాని ఉంది -వైఎస్ సునీత

Sandeep Eggoju
Updated on: 13 Aug 2021 8:10 PM IST
YS Sunitha Letter to Kadapa Dist SP Anburajan
X

వైస్ సునీత (ఫైల్ ఇమేజ్)

YS Sunitha: కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు వైఎస్‌ సునీత లేఖ రాశారు. వివేకా హత్య కేసు నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందంని లేఖలో తెలిపారు. ఆగస్టు 10న ఓ వ్యక్తి తమ ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించాడని, ఆ వ్యక్తిని మణికంఠగా గుర్తించామని వైఎస్‌ సునీత లేఖలో వివరించారు. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలో మణికంఠ ఫోటో ఉందని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి మణికంఠ అనుచరుడంటూ లేఖలో పేర్కొన్నారు. గత నెల 12న సీఐకి ఫిర్యాదు చేశామని, రెక్కీ వెనుక వాస్తవాన్ని, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పాత్రపై నిగ్గు తేల్చాలని కోరారు. ఇవాళ సీబీఐ ఎదుట విచారణకు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి హాజరయ్యారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story