YS Sharmila: నేడు పులివెందులలో వైఎస్ షర్మిల ప్రచారం

YS Sharmila: వేంపల్లి నుండి ప్రారంభంకానున్న షర్మిల బస్సుయాత్ర

Jyothi
Published on: 12 April 2024 9:02 AM IST
YS Sharmila Election Campaign in Pulivendula today
X

YS Sharmila: నేడు పులివెందులలో వైఎస్ షర్మిల ప్రచారం

YS Sharmila: ఎపీ ఎన్నికల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేస్తున్న కడప ఎంపీ స్థానంపై ఆమె ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ పులివెందులలో వైఎస్‌ షర్మిల ప్రచారం చేయనున్నారు.

వేంపల్లి నుండి ప్రారంభం షర్మిల బస్సుయాత్ర ప్రారంభం కానుండగా..సింహాద్రిపురం, లింగాల మండలాలతో పాటు పులివెందుల పట్టణంలో ప్రచారం చేయనున్నారు. వైఎస్‌ షర్మిలతో పాటు ప్రచారంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, సునీత భర్త రెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఇప్పటికే షర్మిల అధికారపార్టీపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story