YS Sharmila: ఈ ఇష్యూ చిన్నది కాదు.. తిరుమల లడ్డూ వివాదంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Tirupati Laddu: తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని, ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ఫైర్‌ అయ్యారు ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Sept 2024 12:49 PM IST
YS sharmila Demands to Conduct CBI Probe on Tirupati Laddu Controversy
X

YS Sharmila: ఈ ఇష్యూ చిన్నది కాదు.. తిరుమల లడ్డూ వివాదంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Tirupati Laddu: తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని, ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ఫైర్‌ అయ్యారు ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్ షర్మిల. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయటపెట్టారా? అని మండిపడ్డారు. అప్పుడే విచారణకు ఆదేశించి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ హయాంలో ఎంపికైన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్‌ షర్మిల.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story