YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు.. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీకి అధికార పార్టీలు లొంగిపోయాయి

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు.. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీకి అధికార పార్టీలు లొంగిపోయాయి
x

YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు.. స్వార్థ రాజకీయాల కోసం బీజేపీకి అధికార పార్టీలు లొంగిపోయాయి

Highlights

YS Sharmila: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

YS Sharmila: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె, ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

షర్మిల మాట్లాడుతూ, "విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. అయితే, ఇప్పుడు అధికార పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల బీజేపీకి లొంగిపోయాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్‌లో మాట్లాడటం లేదు. చిత్తశుద్ధితో ఈ ప్లాంట్ కోసం అందరూ పనిచేయాలి. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి, కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలి" అని అన్నారు.

"అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి, విశాఖ ఉక్కును కాపాడటంలో విఫలమయ్యాయి. ఈ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది" అని షర్మిల పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories