నేడు వైఎస్‌ జగన్,కేసీఆర్‌ భేటీ

నేడు వైఎస్‌ జగన్,కేసీఆర్‌ భేటీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు మరోసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు మరోసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో సీఎంల భేటీ ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు కూడా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం. అపరిష్కృతంగా ఉన్న ఏపీ భవన్ విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజన, 9,10 వ షెడ్యూల్ వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. గోదావరి నంది నుంచి ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న జలాలను ఒడిసి పట్టుకోవాలని ఇరు ప్రభుత్వాలు భావించాయి.

అందులో భాగంగా తెలంగాణలో ఒక రిజర్వాయిర్ ను నిర్మించాలని ఆలోచన చేశారు. అయితే ఈ ఆలోచనను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరమించుకున్నారు. తెలంగాణ తో సంబంధం లేకుండానే గోదావరి , కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై డీపీఆర్ తయారు చేయాలనీ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సాధారణంగా ప్రతి ఏడాది ఏడాది రెండు నుండి మూడు వేల టింఎసీల నీరు గోదావరి నుండి సముద్రంలో కలుస్తుంది. అయితే గత ఏడాది అదనంగా 437 టిఎంసీల నీరు సముద్రంలో కలిసింది. పది సంవత్సరాల తరువాత గతేడాది కృష్ణా నది పరవళ్ళ తొక్కిన సంగతి తెలిసిందే. జులై 1 నురచి నవంబర్ మొదటి వారం వరకు కాలువలతో పాటు సముద్రంలోకి 700 టిఎంసిల వరకు నీరు సముద్రంలోకి వదిలారు. దీనిలో సముద్రంలోకి వదిలినవి 599 టిఎంసిలు ఉన్నాయి. సంవత్సరంలో కేవలం 4 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో నీరు సముద్రంలో కలవడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి అని గణాంకాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories