YS Jagan: ఇవాళ, రేపు కడప జిల్లాలో టూర్

వైఎస్సార్ జయంతి సందర్భంగా నేడు ఇడుపులపాయకు జగన్ సాయంత్రం వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు..

Sandeep Reddy
Published on: 8 July 2021 10:09 AM IST
CM Jagan Two Days Tour in Kadapa District
X

వై ఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

YS Jagan: సీఎం జగన్‌ గురు, శుక్రవారాల్లో కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి 3.35 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 3.40 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. అనంతరం రాయదుర్గం, పులివెందుల, బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story