YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: ఉదయం 11గం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...

Shireesha
Published on: 9 Dec 2021 10:25 AM IST
YS Jagan Review Meeting on PRC Today at Tadepalli Camp Office | AP Live News
X

YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై జగన్ చర్చించనున్నారు. కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంతమేర వేతనాలు పెంచాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవాళ్టి సమావేశంలో ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని తిరుపతిలో ఉద్యోగులకు హమీ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ్టి సమావేశం అనంతరం వేతన సవరణపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Shireesha

Shireesha

Next Story