Drugs: డ్రగ్స్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన జగన్

Drugs: ఏపీలో డ్రగ్స్ సప్లయ్ జరుగుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు.

Arun Chilukuri
Published on: 4 Oct 2021 3:59 PM IST
YS Jagan Responds in Drugs Issue for the First Time
X

Drugs: డ్రగ్స్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన జగన్

Drugs: ఏపీలో డ్రగ్స్ సప్లయ్ జరుగుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించారు. ఏపీకి సంబంధం లేని వ్యవహారంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యమని, లేని అంశాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేయడం అలవాటైందని అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష‌్టను, ప్రభుత్వంతో పాటు వ్యక్తులు,నేతల ప్రతిష్టలను దెబ్బతీయడమే విపక్షాలు పని చేస్తున్నాయని జగన్ విమర్శించారు. ఏపీలో డ్రగ్స్ వ్యవహారం నిజం కాదని తెలిసి కూడా కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు అనవసర ప్రచారం కల్పిస్తున్నాయన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story