YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2024 1:33 PM IST
YS Jagan Protest in Delhi
X

YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో హింసాత్మక ఘటనలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వైసీపీ నేతలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయన్నారు జగన్. నారా లోకేశ్ చెప్పిన ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, వైసీపీ హయాంలో హింసా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. ఈ సందర్భంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ జగన్ ధర్నాకు మద్దతు తెలిపారు. జగన్‌తో కలిసి జంతర్‌మంతర్‌లో వైసీపీ ప్రదర్శించిన దాడుల వీడియోలను వీక్షించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story