YS Jagan Praja Sankalpa Yatra : జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తి

YS Jagan Praja Sankalpa Yatra : జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తి
x
Highlights

YS Jagan Praja Sankalpa Yatra : జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు...

YS Jagan Praja Sankalpa Yatra : జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తయ్యింది. పార్టీకి విజయం కోసం కీలక పాత్ర పోషించిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తవడంతో పదిరోజులు పాటు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు ప్రజలతో మమేకం అయి ప్రభుత్వ పథకాల గురించి వివరించనున్నారు.

2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్రని ప్రారంభించారు జగన్. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకూ మొత్తం13 జిల్లాలను టచ్ చేస్తూ సాగింది పాదయాత్ర. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు 3వేల648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2వేల516 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్ర చేశారు జగన్.

జగన్ పాదయాత్రకు మూడేళ్లు అయిన నేపథ్యంలో పది రోజుల పాటు చైతన్య కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది వైసీపీ. పాదయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా నెరవేర్చమని ఈ పది రోజులు వాటిపై ప్రజలకి వివరించనున్నారు. ఈ పది రోజులు ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారికి మరేమైనా సమస్యలు ఉన్నాయా.? అని ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories