Top
logo

బాబాయ్ మృతదేహాన్ని చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌యిన జగన్

బాబాయ్ మృతదేహాన్ని చూసి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌యిన జగన్
X
Highlights

దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి...

దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. బాబాయ్ మరణవార్త తెలుసుకున్న జగన్ హుటాహుటిన శుక్రవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్‌ వివేకానందరెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. ఆయనకు నివాళి అర్పించారు.. ఈ సందర్భంగా బాబాయ్ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ తోపాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు. అంతకు ముందు వివేకానందరెడ్డి మృతదేహయాన్ని సందర్శించిన వైఎస్‌ విజ‌య‌మ్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. వివేకా భార్యను ఓదారుస్తూ అక్కడే ఉండిపోయారు.

Next Story