Jagan: నేటి నుంచి యధాతథంగా మేమంతా సిద్ధం యాత్ర

Jagan: కేసరపల్లి నుంచి తిరిగి ప్రారంభించనున్న సీఎం జగన్

Jyothi
Published on: 15 April 2024 7:41 AM IST
YS Jagan Memantha Siddham Bus Yatra From Today
X

Jagan: నేటి నుంచి యధాతథంగా మేమంతా సిద్ధం యాత్ర

Jagan: దాడి ఘటన తర్వాత కోలుకున్న సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించనున్నారు. మొన్న కేసరపల్లి దగ్గర నిలిచిపోయిన యాత్రను.. ఈరోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. కాసేపట్లో ప్రారంభంకానున్న జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం జొన్నపాడు దగ్గర భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలోకి ప్రవేశించనుంది. సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

Jyothi

Jyothi

Next Story