ఏపీలో భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం

ఏపీలో భూముల సమగ్ర సర్వేకు శ్రీకారం
x
Highlights

భూ వివాదాలకు శాశ్వత పరిష్కరం కోసమే భూ హక్కు-రక్షణ చట్టం తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. 16వేల మంది సర్వేయర్లతో భూ సర్వే చేపడుతున్నామన్నారు....

భూ వివాదాలకు శాశ్వత పరిష్కరం కోసమే భూ హక్కు-రక్షణ చట్టం తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. 16వేల మంది సర్వేయర్లతో భూ సర్వే చేపడుతున్నామన్నారు. సర్వేయర్లందరికి అత్యధునిక టెక్నాలజీతో, సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజల ఆస్తుల రికార్డులు పదిలంగా ఉండేందుకు భూ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు.

సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు చెక్ పడుతుందని రికార్డులు పక్కాగా ఉంటేనే కబ్జాదారుల నుంచి కాపాడుకోవచ్చాని సీఎం జగన్ తెలిపారు. ఇకపై కోర్టుల చుట్టు ప్రజలు తిరగాల్సిన పనిలేదన్నారు. వందేళ్ల తర్వాత ఇలాంటి సర్వే మరోసారి జరుగుతుందన్నారు. ఏపీలో 1927-28 లో భూ సర్వే చేపట్టారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ కబ్జాదారుల నుంచి ప్రజలకు స్వాతంత్ర్యం రావాలన్నారు.

గతంలో భూ కొలతల గురించి పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేసేవారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ హక్కు- భూ రక్ష పథకం ద్వారా ప్రభుత్వం హమీ కల్పిస్తున్నారు. ప్రతి అంగులం సర్వేతో భూమి కూడా నిర్దారణ అవుతోందన్నారు. ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిటి నెంబర్ కేటాయిస్తామన్నారు.

భూ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖలు పని చేస్తాయని సీఎం జగన్ తెలిపారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో 4వేల 5వందల సర్వే బృందాలతో సర్వే చేపడతామని మొత్తంగా 17వేల 600 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే చేపడతామాన్నారు. ఈ భూ సర్వే మూడు దశల్లో జరుగుతుందన్నారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో వెంటనే రిజిస్ట్రేషన్‌లు చేస్తారన్నారు. 2023 నాటికి చివరి వార్డు, గ్రామంలో భూ సర్వే పూర్తి చేస్తామన్నారు. అంతేకాదు గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories