YS Jagan: రేపు మనం కౌరవులు ఉండే సభకు వెళ్లాల్సి ఉంటుంది

YS Jagan: ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Jun 2024 2:55 PM IST
YS Jagan Key Meeting With YSRCP Leaders
X

YS Jagan: రేపు మనం కౌరవులు ఉండే సభకు వెళ్లాల్సి ఉంటుంది

YS Jagan: ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించింది. ఆపార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందన్నారు. ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయని ఎమ్మెల్యేలకు భరోసానిచ్చారు. ఇప్పటివరకూ తల ఎత్తుకునేలా రాజకీయాలు చేశామని ఇకపై అలాగే చేస్తామని స్పష్టం చేశారు.

స్పీకర్ పదవి చేపట్టబోయే వ్యక్తి మాట్లాడే విధానం.. సోషల్ మీడియాలో చూస్తున్నామని రేపు ఇలాంటి కౌరవలు ఉండే సభలోకి వెళ్లాల్సి ఉంటుందని ఇలాంటి వాళ్ల మధ్య మనం ఏదో సాధిస్తామన్న నమ్మకం లేదని.. నిరాశను వ్యక్తం చేశారు. శిశుపాలుడి పాపాలు పండినట్టు.. చంద్రబాబు పాపాలు పండుతాయని.. అప్పుడు ప్రజలే.. బుద్దిచెబుతారన్నారు. అయితే గతంలో అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలోనే.. మైక్ కట్ చేయగా.. ఇది కౌరవ సభ అని.. చంద్రబాబు సంబోధించారు. తాజాగా ఇప్పుడు జగన్ సైతం కౌరవ సభ అంటూ వ్యాఖ్యానించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story