పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశం

పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశం
x

పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశం

Highlights

*ఏపీ స్టేట్ లెవల్ హైపవర్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ *బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలన్న సీఎం *భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచన

పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి అత్యున్నత ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ , సీఎస్ ఆదిత్య నాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని జగన్ స్పష్టం చేశారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories