YSR Uchitha Pantala Bheema: ఏపీలో రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ పంటల బీమా

YSR Uchitha Pantala Bheema: ఏపీలో రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ పంటల బీమా
x

ఏపీలో రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్‌ పంటల బీమా

Highlights

YSR Uchitha Pantala Bheema: ఏపీలో ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా గతేడాది ఖరీఫ్ పంటల బీమాను జమ చేశారు సీఎం జగన్.

YSR Uchitha Pantala Bheema: ఏపీలో ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా గతేడాది ఖరీఫ్ పంటల బీమాను జమ చేశారు సీఎం జగన్. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తం 15 లక్షల 15 వేల మందికి 18 వందల కోట్ల రూపాయలను జమ చేశారు. రైతు బాగుంటేనే రైతు కూలీ కూడా బాగుంటాడనే ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు సీఎం జగన్. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.

రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్‌ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories