logo
ఆంధ్రప్రదేశ్

గురువులకు వందనం: సీఎం జగన్‌

గురువులకు వందనం: సీఎం జగన్‌
X
Highlights

మ‌న‌కు విద్య‌, వివేకం, విలువ‌లు నేర్పి ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దే గురువుల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ ...

మ‌న‌కు విద్య‌, వివేకం, విలువ‌లు నేర్పి ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దే గురువుల‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంద‌నాలు తెలియ‌జేశారు. ఇవాళ గురు పూజోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ట్వీట్ చేశారు. గురువును దైవంగా పూజించే సంప్ర‌దాయం భార‌త‌దేశానిదని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ ఘ‌న నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ శుభాకాంక్ష‌లు తెలిపారు.'గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు వందనం' అని సీఎం జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Web TitleYS Jagan conveys greetings to all teachers on Teacher's day
Next Story