YS Jagan: వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే

YS Jagan: చంద్రబాబు, పవన్‌పై మండిపడ్డ జగన్‌

Dhatripriya
Updated on: 16 May 2023 12:48 PM IST
YS Jagan Comments On Chandrababu And Pawan Kalyan
X

YS Jagan: వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే

YS Jagan: చంద్రబాబు, పవన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తుకు వస్తుందని కామెంట్ చేశారు. చంద్రబాబు, పవన్ పొత్తులను జిత్తులను, కుయుక్తులను నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా? అని జగన్‌ ప్రశ్నించారు. అధికారంలో ఉంటే అమరావతి లేదంటే జూబ్లీహిల్స్‌ ఉంటారని.. దోచుకొని హైదరాబాద్‌లో ఉండటం వీరిపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానన్న గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు ఒంటరిగా బరిలోకి దిగే దమ్ముందా అంటూ జగన్ ప్రశ్నించారు.

గజదొంగల ముఠాగా దోచుకోవడానికే విపక్షాల పొత్తులని సీఎం జగన్ అన్నారు. పవన్‌ను రెండుచోట్లా ఓడించారని... 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేని స్థితిలో దత్తపుత్రుడు ఉన్నాడంటూ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్‌కు సీఎం పదవి వద్దని...దోపిడీలో వాటా చాలంటూ ఎద్దేవా చేశారు. పొత్తులు పెట్టుకుని, తెగదెంపులు చేసుకునేది వీళ్లే... వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లే సీఎం జగన్ సెటైర్లు వేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story