YS Jagan: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు సీఎం జగన్ సవాల్

YS Jagan: 175 స్థానాల్లో పోటీ చేస్తారా?

Dhatripriya
Updated on: 28 Feb 2023 3:00 PM IST
YS Jagan Challenged To Chandrababu And Pawan Kalyan
X

YS Jagan: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు సీఎం జగన్ సవాల్

YS Jagan: టీడీపీ, జనసేన అధినేతలకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఉందా అంటూ ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు 175 వై నాట్‌.. అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను, నేతలకు హితబోధ చేసిన జగన్‌ ఇప్పుడు విపక్ష నేతలను టార్గెట్‌ చేస్తూ వ్యూహాత్మక అస్త్రాలను సంధిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ను టార్గె్ట్‌ చేస్తూ సవాల్‌ విసిరి ఏడాది ముందుగానే ఏపీలో పొలిటికల్‌ హీట్‌ను రాజేశారు.

గుంటూరు జిల్లా తెనాలిలో మూడో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. టీడీపీ, జనసేన పార్టీలను ఇరకాటంలో పెట్టే విధంగా కొత్త సవాల్‌ను సంధించారు. 175 స్థానాల్లో పోటీ చేసి, గెలిచే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులు చేస్తున్నాం కాబట్టే తమకు ఓట్లు అడిగే హక్కు, గెలిచే సత్తా ఉన్నాయన్నారు సీఎం జగన్‌. ప్రజలకు ఎప్పుడూ మంచి చేయలేదు కాబట్టే చంద్రబాబు, పవన్‌కు పోటీ చేసే ధైర్యం లేదన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టే ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం జగన్‌. అన్నింటిని గమనించి ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓ మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. మొత్తం మీద 2024 ఎన్నికలే లక్ష్యంగా తన పార్టీ నేతలకు ఇప్పటి వరకు హితబోధ చేస్తూ వచ్చిన వైసీపీ అధినేత ఇప్పుడు విపక్షాలకు సవాల్‌ విసురుతూ రాజకీయ వేడిని పెంచారు.

Dhatripriya

Dhatripriya

Next Story