బలరాంరెడ్డి- చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్‌

బలరాంరెడ్డి- చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్‌
x
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి, మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి, మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. కాగా, వరుడు బలరాంరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు కజిన్ అవుతారు. గతనెలలో అమరావతిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి బలరాంరెడ్డితో కలిసి వెళ్లారు చందనాదీప్తి. తన పెళ్లికి రావాలని జగన్‌ను ఆయన సతీమణి వైఎస్ భారతిని కోరుతూ శుభలేఖ అందజేసిన సంగతి తెలిసిందే.

అంతకుముందు ఫోర్ట్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి - సోమ వివాహ నిశ్చితార్థానికి కూడా సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి విమానంలో తాడేపల్లి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories