YS Bhaskar Reddy: నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న వైఎస్ భాస్కర్‌రెడ్డి

YS Bhaskar Reddy: కడప సెంట్రల్‌ జైల్‌ గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు

Jyothi
Published on: 12 March 2023 8:52 AM IST
YS Bhaskar Reddy will appear in the CBI investigation today
X

YS Bhaskar Reddy: నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న వైఎస్ భాస్కర్‌రెడ్డి

YS Bhaskar Reddy: వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కడప సెంట్రల్‌ జైల్‌ గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 23న హాజరుకావాలని గతంలో సీబీఐ గతంలో నోటీసులు ఇచ్చింది. ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేనని.. సీబీఐకి భాస్కర్‌రెడ్డి లేఖరాశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ... గత ఎనిమిది రోజుల క్రితం మరోసారి నోటీసులు ఇచ్చింది సీబీఐ. సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ భాస్కర్‌రెడ్డికి ఇప్పటి వరకు మూడుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. 12న తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని పేర్కొనడంతో విచారణకు హాజరకానున్నారు.

Jyothi

Jyothi

Next Story