logo
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువకుల వీరంగం.. చితకబాది అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Youth Create Ruckus in Dr BR Ambedkar Konaseema District
X

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువకుల వీరంగం.. చితకబాది అదుపులోకి తీసుకున్న పోలీసులు..

Highlights

Ambedkar Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు.

Ambedkar Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. రహదారిపై ఆర్టీసీ బస్సుకు అడ్డంగా పడుకుని వీరంగం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా పోలీసులకు సైతం ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో లాఠీలు ఝులిపించి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువకులు గతంలో పలు కేసులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గంజాయి మత్తులో ఇలా వీరంగం సృష్టించారా..? లేక మానసిక స్థితి కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Web TitleYouth Create Ruckus in Dr. BR Ambedkar Konaseema District
Next Story