Nandyala: డోన్‌లో పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Nandyala: బైక్‌ల దొంగతనం అనుమానంతో పీఎస్‌లో విచారించిన పోలీసులు

Rama Rao
Published on: 4 Nov 2022 3:28 PM IST
Youth Commits Suicide Due to Doan Police Harassment in Nandyala
X

Nandyala: డోన్‌లో పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Nandyala: నంద్యాల జిల్లా డోన్‌లో పోలీసుల వేధింపులతో అజయ్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్‌ల దొంగతనం అనుమానంతో అజయ్‌ను పోలీస్ స్టేషన్‌లో మూడురోజులు విచారించారు. సోమవారం స్టేషన్‌కు తీసుకెళ్లి బుధవారం వరకు తమ కుమారుడిని తీవ్రంగా కొట్టారని మృతుని తల్లి ఆరోపించింది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు కొట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కానిస్టేబుల్స్ కావాలనే తమ కుమారున్ని అక్రమ కేసులో ఇరికించారని మృతుడు తల్లి ఆరోపించింది. 2017లో MRF టైర్ల దొంగతనం కేసులో అజయ్ నిందితుడుగా ఉన్నాడు.

Rama Rao

Rama Rao

Next Story