యానాం ఎదురులంక బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు శునకం

Yanam: యువతి చెప్పుల వద్దే తిరుగుతూ ఎదురుచూసిన పెంపుడు శునకం

Jyothi
Published on: 18 July 2023 11:05 AM IST
Young Woman Committed Suicide by Jumping into the Godavari
X

యానాం ఎదురులంక బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు శునకం

Yanam: కుటుంబ సభ్యులే బంధాలకు, బంధుత్వాలకు విలువనివ్వని రోజులువి. కాని ఓ కుక్క తన యజమాని పట్ల చూపించిన ప్రేమ ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకి మందాగి కాంచన గల్లంతైయింది. వెంట వచ్చిన యజమాని కనిపించక పోవడంతో ఆమె చెప్పులు వద్దే తిరుగుతూ గోదావరి వైపు చూసి అరుస్తోంది. కుక్క అరుపులను గమనించి గోదావరిలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

15 రోజుల క్రితం అక్కున చేర్చుకుని గుప్పెడు మెతుకులు పెట్టిన యజమానిపై శునకం చూపించిన ప్రేమ కంటతడి పెట్టిస్తోంది. కుటుంబ సభ్యులు వచ్చి శునకాన్ని ఇంటికి తీసుకు వెళ్లే వరకు అక్కడే ఉండి యజమాని పట్ల ఎంతో విశ్వాసం చూపించింది. గోదావరిలో గల్లంతయిన యువతి ఆచూకీ కోసం పోలీసులు , స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహం వెలికి తీశారు.


Jyothi

Jyothi

Next Story