Butta Renuka: ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బుట్టా రేణుక ప్రచారం

Butta Renuka: నందవరం మండలం కనుకవీడు, చిన్నకోతిని గ్రామాల్లో ప్రచారం

Shashank Gullapelli
Published on: 27 April 2024 9:14 AM IST
Yemmiganur YCP MLA Candidate Butta Renuka Campaign
X

Butta Renuka: ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బుట్టా రేణుక ప్రచారం

Butta Renuka: సీఎం జగన్ చేసిన అభివృద్ధి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. నందవరం మండలం కనుక వీడు, చిన్న కోతిని గ్రామాల్లో బుట్టా రేణుక సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న పాలెంలో చేసిన అభివృద్ధి ఓటర్లకు వివరించారు. సీఎం జగన్ పాలనలో ఎమ్మిగనూరు నియోజక వర్గంలో జగనన్న అభివృద్ధి జరిగిందని.. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ మరింతగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని బుట్టా రేణుక ఓటర్లకు హామీ ఇచ్చారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story