Vizianagaram: కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ విజయం

Vizianagaram: తొలి మేయర్‌గా వెంపడాపు విజయలక్ష్మీ * విజయనగరం డిప్యూటీ మేయర్‌గా నాగలక్ష్మీ

Sandeep Eggoju
Published on: 18 March 2021 11:02 AM IST
YCP Won in Corporation Elections In Vizianagaram
X

వైసీపీ ఫైల్ ఫోటో 

Vizianagaram: విజయనగరం కార్పొరేషన్‌గా అవతరించాక జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయదుందిభి మోగించింది. అయితే ఫలితాలు వచ్చినప్పటినుండి తొలి మేయర్‌ స్థానం ఎవరికి దక్కనుందనే చర్చ అందరిలోనూ నెలకొంది. ఇక అనూహ్యంగా తూర్పు కాపు కులానికి చెందిన వెంపడాపు విజయలక్ష్మీని వైసీపీ అధిష్టానం తొలి మేయర్‌గా నిర్ణయించింది. దీంతో తొలి మేయర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి కుమార్తె శ్రావణిని రెండవ డిప్యూటీ మేయర్‌గా అధిష్టానం ప్రకటించగా మొదటి డిప్యూటీ మేయర్‌గా నాగలక్ష్మీ పేరును పెద్దలు నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా సామాజిక సమీకరణాల ప్రాతిపదికన మేయర్‌గా విజలక్ష్మీని ప్రకటించారని ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక ప్రాతిపదికన కొంతమందిని జిల్లా నేతలు సూచించినప్పటికీ వాటన్నింటిని పక్కన పెట్టి విజయలక్ష్మీని సీఎం జగన్‌ ఎన్నిక చేశారని తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story