జనంలోకి జగన్.. బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల చేయనున్న వైసీపీ

Jagan: మొదటి నాలుగు రోజుల షెడ్యూల్‌ను సిద్ధం చేసిన వైసీపీ

Jyothi
Published on: 19 March 2024 11:46 AM IST
YCP to Release Schedule of Jagan Bus Yatra
X

జనంలోకి జగన్.. బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల చేయనున్న వైసీపీ

Jagan: రెండోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది వైసీపీ. ఇందులో భాగంగా... మేమంతా సిద్ధం పేరుతో జగన్ ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే.. జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను ఇవాళ వైసీపీ విడుదల చేయనుంది. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు బస్సుయాత్ర చేపట్టనున్నారు.

21 పార్లమెంట్‌ పరిధిలో యాత్ర.. 21 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగిలిన పార్లమెంట్ పరిధిలో సభలు ఉండనున్నాయి. పగలు వివిధ వర్గాల ప్రజలతో ఇంటరాక్షన్స్.. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బస్సు యాత్ర ప్రకటనతో వైసీపీ క్యాడర్ లో జోష్ పెరిగింది.

Jyothi

Jyothi

Next Story