YCP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

YCP: ఉగాదికి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్న వైసీపీ

Jyothi
Published on: 3 April 2024 3:01 PM IST
YCP to Release Manifesto for Ugadi
X

YCP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

YCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఇచ్చే హామీలు పక్కాగా అమలు చేసే అంశాలనే మేనిఫెస్టోలో పెడతామంటున్నారు వైసీపీ బాస్. దీంతో వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంతకాలంగా మేనిఫెస్టోపై కసరత్తు చేసింది అధికార వైసీపీ. 2019 మేనిఫెస్టో కొనసాగింపుతో పాటు రెండు కీలక హామీలను చేర్చనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేనిఫోస్టో రూపకల్పన ఉండబోతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

విపక్షాల మేనిఫెస్టోకు దీటుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండంటూ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరోవైపు గతంలో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామని చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story