YSRCP: టీడీపీ, జనసేన పార్టీలకు చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహరచన

YSRCP: పార్టీలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్న వైసీపీ

Shekhar G
Published on: 29 Feb 2024 6:16 PM IST
YCP Strategy To Check TDP And Janasena parties
X

YSRCP: టీడీపీ, జనసేన పార్టీలకు చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహరచన

YSRCP: టీడీపీ, జనసేన కూటమికి చెక్‌ పెట్టేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తుంది. టీడీపీ, జనసేన అసంతృప్త నేతలతో జిల్లాల కీలక నేతలు టచ్‌లోకి వెళ్తున్నారు. జనాకర్షణ కలిగిన ఇరు పార్టీల నేతలను పార్టీలోకి రావాలని వైసీపీ ఆహ్వానం పలుకుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. మరికొందరు నేతలు సూర్యారావు బాటలోనే వెళ్లేందుకు రెడీ అయ్యారు.

ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, కడప జిల్లా చెందిన సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌, కందుల దుర్గేష్‌తో వైసీపీ చర్చలు జరుపుతోంది. మరో వైపు పార్టీ సీనియర్లతో జలీల్‌ఖాన్‌ మంతనాలు జరుపుతున్నారు. తాజా సమీకరణాల నేపథ్యంలో నేతల చేరికపై వైసీపీ నాయకత్వం కొత్త లెక్కలు సిద్ధం చేస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story