AP News: వేటు తప్పదా..?స్పీకర్ ఎదుట హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

AP News: తన వద్ద ఉన్న ప్రతి ఫైల్ క్లియర్ చేస్తా అంటున్న స్పీకర్

Shekhar G
Published on: 29 Jan 2024 12:21 PM IST
YCP Rebel MLAs Who Came To The AP Assembly Speaker Office
X

AP News: వేటు తప్పదా..?స్పీకర్ ఎదుట హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

AP News: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యే పై స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం సంచలనంగా మారబోతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే.. వారిపై స్పీకర్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. వారిపై వేటు వేస చాన్స్ అధికంగా కనపిస్తున్నాయి. అయితే. అంతకు ముందే.. స్పీకర్ ఎదుట వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని గడువు కోరినట్టు తెలుస్తుంది. దానికి స్పీకర్ అనుమతిస్తారా.. లేక వేటు వేస్తారా..? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలిచ్చింది. ఆమేరకు వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు స్పీకర్ కార్యాలయం సమయానికి కేటాయించింది. అయితే వివరణ ఇవ్వాలా వద్దా అన్నదానిపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు. కాగా ఇప్పటికే వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని వైసీపీ రెబెల్స్ స్పీకరుకు లేఖ రాశారు. అయితే.. ఆ 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అది రాబోయే ఎన్నికలపై ఎఫెక్ట్ పడే అవకాశం బలంగా కనిపిస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story