బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు

బొమ్మలూరు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని

Rama Rao
Updated on: 27 Jun 2022 9:30 PM IST
YCP Party Colors for NTR Statue in Bommuluru | Krishna District News
X

బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు

YCP Vs TDP: కృష్ణాజిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. బొమ్ములూరు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకుని బొమ్మలూరు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకంతో శుద్ధి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని కి వ్యతిరేకంగా టిడిపి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైసిపి రంగులను చెరిపేసి ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నేతలు పసుపు రంగులు వేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మహానాడు బ్యానర్లను చించివేసిన అధికార పార్టీ నేతలు, ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దుర్మార్గమని మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆగ్రహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పసుపు రంగులు వేస్తున్న కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దుర్భాషలాడుతూ దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


Rama Rao

Rama Rao

Next Story