పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ.. వ్యూహాత్మంగా అడుగులు

పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ.. వ్యూహాత్మంగా అడుగులు
x

వైసీపీ జెండా ఫైల్ ఫోటో 

Highlights

*నెల్లూరు జిల్లాలో సత్తా చాటాలని జిల్లా నాయకులకు నేతలు దిశానిర్దేశం *ఏకగ్రీవాలను ప్రోత్సాహించాలని నాయకులకు సూచిన

పంచాయతీ ఎన్నికలను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. పల్లెలో పట్టుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఎడమొహం... పెడమొహంగా ఉన్న నేతలను కలసి బుజ్జగింపుల పర్వాన్ని కొసాగిస్తోంది. నెల్లూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగినా సమావేశం.. ఆపై నేతల మాటల సారాంశం గమనిస్తే వైసీపీ పంచాయతీ పోరును ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది.

నెల్లూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మరోసారి చరిత్ర సృష్టించడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నెల్లూరులో మంత్రి మేకపాటి నివాసంలో వైసీపీ నేతలు సమావేశమై.... గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడానికి కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి కసరత్తు చేశారు.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నా నెల్లూరులోని ముఖ్య నాయకులతో వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అసంతృప్తులను బుజ్జగించి కీలక సూచనలు చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది మార్కులతో సత్తా చాటిన నెల్లూరు జిల్లా.... స్థానికంలోనూ అదే విధంగా విజయదుందుభి మోగించిందేందుకు అందరూ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నాయకులకు నేతలు దిశానిర్ధేశం చేశారు

జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో.... స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాల పై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజాభిష్టంతో వీలైనన్ని ఏకగ్రీవాలు జరిగేలా చూడాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలను.... సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ ప్రస్తావించారు. పార్టీలో రెబెల్స్ ను సంతృప్తి పరిచేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చొరవచూపాలని దిశానిర్దేశం చేశారు. దీంతో నెల్లూరు జిల్లా నాయకులంతా ఏకమై పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతామన్నారు. మొత్తంగా పంచాయతీ పోరు కోసం వ్యూహ, ప్రతి వ్యూహాలపై జిల్లా నాయకత్వమంతా కలిసి చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories