ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌... ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన వైసీపీ

CM Jagan: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ ఏపీ పెండింగ్‌ అంశాలు

Rama Rao
Published on: 5 April 2022 3:22 PM IST
YCP MPs Grand welcome CM Jagan In Delhi | AP New Today
X

ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌

ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు

CM Jagan Delhi Tour: జగన్‌ ఢిల్లీ టూర్‌ ఏపీ సీఎం జగన్‌ను ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌ ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 4గంటల 45 నిమిషాలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్దికి సంబంధించిన అంశాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించనున్నారు.

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరనున్నారు. ఏపీలో నూతనంగా 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు సీఎం జగన్. ఇక రేపు గజేంద్రసింగ్ షెకావత్‌ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story