కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ

X
Highlights
*విభజన హామీలు, పోలవరంతో పాటు పలు అంశాలపై చర్చ *రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులను షాకు వివరించిన రఘురామ *దేవాలయాలపై దాడుల ఘటనపై దర్యాప్తు చేయాలని కోరిన ఎంపీ
Arun Chilukuri3 Feb 2021 3:58 PM GMT
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. విభజన హామీలు, పోలవరంతో పాటు పలు అంశాలపై చర్చించారు. రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులు, అమరావతి సెంటిమెంట్‌ను అమిత్ షాకు వివరించినట్టు రఘురామ తెలిపారు. అలాగే.. రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై త్వరితగతిన దర్యాప్తు చేయాలని హోంమంత్రిని కోరినట్టు స్పష్టం చేశారు. ఏపీ పర్యటనకు రావాలని ఆహ్వానించగా.. దానికి అమిత్ షా ఓకే అన్నారని తెలిపారు రఘురామ కృష్ణరాజు.
Web TitleYcp MpRaghu Rama Krishna Raju Meet Amit Shah
Next Story