రాజా భయ్యా నాకు మంచి స్నేహితుడు : ఎంపీ రఘురామ

రాజా భయ్యా నాకు మంచి స్నేహితుడు : ఎంపీ రఘురామ
x
Highlights

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన తోలు తీస్తామంటూ వైసీపీ ఎంపీలు నిన్న...

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన తోలు తీస్తామంటూ వైసీపీ ఎంపీలు నిన్న చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని... ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని చెప్పారు. తోలు తీయడం తన వృత్తి కాదని, ప్రజలు అసహ్యించుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు.

ఆయన ఇంకేమన్నారంటే.. తోలు తీయడం నా వృత్తి కాదండి. వారు బహుభాషా కోవిదులు. అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా... నాలో నేను మాట్లాడతాను కానీ.. ప్రజలు అసహ్యించుకొనేలా ... ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. దానికి నేనేమీ చేయలేను. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం ఉన్నారు. వాళ్లు నా మాట వినండి. అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అసలు పేరు రఘు రాజ్ ప్రతాప్. రాజా భయ్యా మాత్రమే కాదు.. నన్ను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు ... మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. నా ఒంటిపై చిన్న చేయి పడితే.. దానికి స్పందించి.. నన్ను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు, రాయలసీమలో కూడా ఉన్నారు. పులివెందులలో కూడా నా స్నేహితులు ఉన్నారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగలను. కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories