YCP MP: ట్రాప్ చేయడానికి మహిళతో మెసేజ్ లు..స‌జ్జ‌లపై ఎంపీ రఘురామ ఫైర్

YCP MP: రామకృష్ణారెడ్డిపై వైసీపీ తిరుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శ‌లు చేశారు

Samba Siva Rao
Published on: 10 May 2021 4:12 PM IST
YCP MP Raghu Rama Krishna Raju Sensational Comments On Sajjala
X

రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)

YCP MP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైసీపీ తిరుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శ‌లు చేశారు. పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. తనను టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. సోషల్ మీడియలో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నాడని ఆరోపించారు. తనను ట్రాప్ చేయడానికి ఒక మహిళతో మెసేజ్ లు పంపిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని.. మీ కుట్రలన్నింటినీ త్వరలోనే బయపెడతానని హెచ్చరించారు. తన వ్యక్తిగత కార్యదర్శి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని ఫిర్యాదు లేఖలో తెలిపానని చెప్పారు.

సజ్జలను బిజ్జల అంటూ సంబోధిస్తూ.. బిజ్జల దిశానిర్దేశంతో తనను అసహనానికి గురి చేస్తూ, కేసులు వేద్దామని వాళ్లంతా ప్లాన్ చేశారని అన్నారు. సజ్జలా పిచ్చిపిచ్చి వేషాలు వేయకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు, మీ వెధవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయని రఘురాజు హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారాన్ని పక్కన పెట్టాలని... సీఎం జగన్, సజ్జల ఇద్దరూ వారి పరిధుల్లో ఉండాలని అన్నారు. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోవద్దని హెచ్చరించారు.

రేయ్ సజ్జల ఎవడ్రా నువ్వు? ఆఫ్టరాల్ నువ్వొక జర్నలిస్టువి, అనధికార రాష్ట్ర హోం మంత్రిలా వ్యవహరిస్తున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్ర హోమ్ మంత్రికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, అన్నీ వ్యవహారాలను నువ్వే చూసుకుంటున్నావని మండిపడ్డారు. ఈ అంశంపై నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సజ్జల సూచన మేరకు తనకు ఒక వంద కాల్స్ వచ్చాయి జగన్ రెడ్డీ అని అన్నారు. నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ? నీ దగ్గర కూడా నా మనుషులు ఉన్నారని రఘురామకృష్ణరాజు చెప్పారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story