Anantapuram: టీడీపీ నేతలపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

* వరదల్లో బాధితులకు సాయం చేసినది లేదు : గోరంట్ల * అయిపోయిన పెళ్లికి మేళంలా పయ్యావుల రియాక్షన్ : గోరంట్ల

Shilpa
Published on: 27 Nov 2021 4:37 PM IST
YCP MP Gorantla Madhav Sensational Comments on TDP Leaders Behaviour
X

టీడీపీ నేతలపై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం జిల్లా వరదలపై సమీక్షా కార్యక్రమం రచ్చగా మారింది. వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ నేతల తీరుపై విరుచుకు పడ్డారు. టీడీపీనేతలు తిండికి తిప్పరాజు, పనికి పోతరాజులా తయ్యారయ్యారని వరద సాయం చేయకుండా చేసిన పనులపై విమర్శలు చేస్తూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేత పయ్యావుల తీరుపై కూడా గోరంట్ల మండిపడ్డారు. అయితే తనను దూషించడంపై పయ్యావుల తీవ్రంగా రియాక్టయ్యారు, వరదలపై చర్చ జరుగుతుంటే నాపై వ్యక్తిగత దూషణలెందుకు చేస్తున్నారని మండిపడ్డారు. నేతలిద్దరూ ఇలా వాదులాడుకుంటుండగా మంత్రి బొత్స సత్యనారాయణ కలగ చేసుకుని వారికి సర్ది చెప్పారు.

Shilpa

Shilpa

Next Story