అలా అయితే, రాజీనామా చేస్తా.. మంత్రి అవంతి ఛాలెంజ్!

S. Srikanth
Published on: 27 May 2020 10:58 PM IST
అలా అయితే, రాజీనామా చేస్తా.. మంత్రి అవంతి ఛాలెంజ్!
X
Avanthi Srinivas (File Photo)

తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో భూములను కబ్జా చేస్తున్నారని... సింహాచలం భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. ఎందుకు ఓడారో సమీక్ష నిర్వహించుకోవాలి

ఈ వ్యాఖ్యలపై అవంతి మాట్లాడుతూ, చంద్రబాబు మాటలు గురువింద సామెంతను గుర్తుకు తెస్తున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయాన్ని మహానాడులో సమీక్ష చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానేసి, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సహకరించాలని చెప్పారు. గజం స్థలం కబ్జా చేసినట్టు నిరూపించినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.


S. Srikanth

S. Srikanth

Next Story