వైసీపీ ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్.. ఫుల్ క్లారిటీ ఇస్తున్న హైకమాండ్..

YCP MLAs Tension: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏం చేయాలి?

Arun Chilukuri
Updated on: 4 May 2022 9:01 PM IST
YCP MLAs Tension Over Survey Report
X

వైసీపీ ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్.. ఫుల్ క్లారిటీ ఇస్తున్న హైకమాండ్..

YCP MLAs Tension: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఎలా ఉండాలన్నదానిపై వైసీపీ హైకమాండ్ ఇప్పట్నుంచి ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ ఆధారంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రోజుకి ముగ్గురు ఎమ్మెల్యేలను పిలిపించుకొని వన్ టు వన్ సమావేశం నిర్వహిస్తోంది. నియోజకవర్గం సమస్యలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. 2019 ఎన్నికలు గెలిచిన ఎమ్మెల్యే గ్రాఫ్ ప్రస్తుతం ఉన్న గ్రాఫ్ వివరిస్తూ జాగ్రత్తలు సూచిస్తోంది. మేల్కొంటే ఒకే లేకుంటే మార్పు అనివార్యమన్న సంకేతాలిస్తోంది.

నియోజకవర్గంలో ఉన్న క్లారిటీని సదరు ఎమ్మెల్యేలకు చూపించడంతో సిట్టింగ్‌లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రెండున్నరేళ్ల పనితీరు ప్లస్, మైనస్ విస్తరిస్తూ జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలూ ఇస్తున్నారు. అదే సమయంలో అవినీతి, అందులో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని వివరిస్తూ లోకల్ రాజకీయాల్లో గ్రూపు రాజకీయాలపైనా సునిశిత వార్నింగ్ సైతం ఇస్తున్నారు ముఖ్యులు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story