వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌

వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ తేలింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం ఆర్కే తండ్రి దశరాథరామిరెడ్డి కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్కే మంగళవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ అని తేలడంతో 14 రోజుల పాటు హోమ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తనను ఈ మధ్య కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్కే బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందటానికి తాను విశాఖపట్నానికి వెళ్లినట్లు రాజా చెప్పారు.

ఏపీలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4634కు చేరింది. మరోవైపు ఈ వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 425607కు చేరుకుంది. ఇప్పటివరకు ఏపీలో 4308762 కరోనా టెస్టులు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories