సైకిల్‌కు ఓటు వేయమన్న వైసీపీ ఎమ్మెల్యే : జోక్‌ చేశానంటూ కవరింగ్‌

Election Campaign: సైకిల్‌ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను కోరిన వైసీపీ ఎమ్మెల్యే‌

Sandeep Eggoju
Published on: 5 April 2021 12:21 PM IST
YCP MLA Vasubabu Asked to Vote Cycle Symbol in Ungutoor
X

వైసీపీ ఎన్నికల ప్రచారం 

Election Campaign: పశ్చిమగోదావరి జిల్లా గోపినాథ్‌ పట్నంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుగానూ వైసీపీ ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ప్రచారంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు తడబడ్డారు. మైక్‌ అందుకున్న ఎమ్మెల్యే వాసుబాబు సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అప్పటివరకు ఓటర్ల వైపు దండం పెడుతూ నిల్చున్న వైసీపీ అభ్యర్థులు ఒక్కసారిగా అవాక్కై ఎమ్మెల్యే వైపు చూశారు. అటు ప్రచార వాహనం చుట్టూ చేరిన వారు నవ్వుకున్నారు. దీంతో వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే సైకిల్‌ గుర్తుపై ఓటేయాలంటూ జోక్‌ చేశానని చెప్పుకొచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story