AP Municipal Elections: సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచినా గెలిచాం-రోజా

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసింది.

Samba Siva Rao
Published on: 14 March 2021 3:49 PM IST
Roja Comments On  YCP Leaders
X

రోజా ఫైల్ ఫోటో 

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని దూసుకుపోతోంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడ్‌ అయిందని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఒక చరిత్ర అన్నారు. ప్రతిపక్షాలతో పాటు రెబల్స్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. మరో 25 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన నేతలు వార్నింగ్ ఇచ్చారు. చైర్మన్ సీటు కాదు కదా.. కనీసం మున్సిపల్ ఆఫీసు గేటు కూడా తాకలేరంటూ వ్యాఖ‌్యానించారు. సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచినా రెండు మున్సిపాలిటీల్లో గెలిచామని రోజా అన్నారు. రెబల్స్‌తో నామినేషన్ ప్రజలు బుద్ది చెప్పారని రోజా అన్నారు. పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇదే పెద్ద గుణపాఠం అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story