YCP MLA Roja in Home Quarantine: హోమ్ క్వారంటైన్ లో నగరి ఎమ్మెల్యే రోజా..?

YCP MLA Roja in Home Quarantine: హోమ్ క్వారంటైన్ లో నగరి ఎమ్మెల్యే రోజా..?
x
MLA ROJA
Highlights

YCP MLA Roja in the Home Quarantine: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

YCP MLA Roja in the Home Quarantine: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 25,422కేసులు నమోదు కాగా 292 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కూడా కరోనా బాధ తప్పదం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా సెగ తగులుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రజాప్రతినిధులకు భయం పట్టుకుంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా గన్‌ మెన్‌ కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రోజా అప్రమత్తమయ్యారు. అమె, అమె కుటుంబ సభ్యులు సైతం కరోనా పరీక్షలు చేయించుకుని, ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌ లో ఉన్నారు. కరోనా బారిన పడిన రోజా గన్‌ మెన్‌ తిరుపతిలోని స్విమ్స్‌ లో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రోజా ఆరోగ్యం గురించి అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రోజా పార్టీ కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నామని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ అందోళన చెందవద్దని, ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నట్లుగా రోజా పేర్కొన్నారు. ఇదిలావుంటే శుక్రవారం ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌ రావడంతో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌,అతనితో (పైమరీ కాంటాక్ట్‌ ఉన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం హోమ్‌ క్వారంటైన్‌ కు వెళ్లారు. తాజాగా రోజా కూడా గన్‌ మెన్‌ కు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్‌ క్వారంటైన్‌ లో ఉన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న రోజా, ఆమె కుటుంబ సభ్యులు ఆ పరీక్షల ఫలితాలు వచ్చేవరకూ హోమ్‌ క్వారంటైన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories