AP fights corona: దేశంలోనే మొదటి సారిగా.. హోమ్ క్వారంటైన్ లోని బాధితులకు కరోనా కిట్లు.. జగన్ ప్రభుత్వ ముందడుగు!

AP fights corona: దేశంలోనే మొదటి సారిగా.. హోమ్ క్వారంటైన్ లోని బాధితులకు కరోనా కిట్లు.. జగన్ ప్రభుత్వ ముందడుగు!
x
corona home quarantine kits in AP
Highlights

AP fights corona: కరోనా పై పోరులో జగన్ సర్కార్ దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోంది.

కరోనా పై పోరులో జగన్ సర్కార్ దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే కరోనా టెస్టుల విషయంలో ఎంతో వేగాన్ని సాధించి.. కరోనా నివారణ కోసం ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మరో కొత్త అడుగు వేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ కిట్ రూపొందించింది. ఈ కిట్ ను పూర్తి ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. దీంతో కరోనా నివారణలో జగన్ సర్కార్ మరో పెద్ద ముందడుగు వేసినట్టయింది.

కరోనా కిట్ లో ఏమేం ఉంటాయంటే..

మాస్కులు, శానిటైజర్లు, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లతో పాటు ఆక్సిజన్ లెవెల్‌ను చూసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ ఈ కరోనా కిట్ లో ఉంటాయి. వీటితో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్న బాధితులు కోలుకోవడానికి మరింత మానసిక ధైర్యం వస్తుంది. వీటన్నిటినీ కొనుక్కునే వేసులుబాటి లేని వారు ఈ ఏర్పాటుతో తమకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలకు ముందుకు వచ్చే అవకాశం వుంటుంది. ప్రభుత్వం తమకు అండగా ఉందనే భావనతో మరింత ధైర్యంగా ప్రజలు కరోనా పై యుద్ధం చేస్తారని చెప్పవచ్చు.

ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం అనేక చర్యలు చేపట్టింది. రికార్డుస్థాయిలో కరోనా శాంపిల్ టెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అలాగే కరోనా నిర్ధారణ టెస్టింగ్ కోసం ప్రతీ జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున ఏర్పాటు చేసింది. దీంతో కరోనా టెస్టుల్లో మరింత వేగం పెరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories