Kotamreddy Sridhar Reddy: అమరావతి పాదయాత్ర రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే

* న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి రైతుల పాదయాత్ర * అమరావతి రైతులను కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Shilpa
Published on: 29 Nov 2021 12:29 PM IST
YCP MLA Kotamreddy Sridhar Reddy Meets Farmers of Amaravati Padayatra in Nellore
X

అమరావతి పాదయాత్ర రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే(ఫైల్ ఫోటో)

Kotamreddy Sridhar Reddy: ఓ వైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇంకోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి పాదయాత్ర రైతులను కలవడం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచింది.

అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఈ అంశం చర్చనీయాంశమైంది. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహా పాదయాత్ర రెండు రోజుల క్రితం నెల్లూరుకు చేరింది. నిన్న ఇవాళ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నిర్వాహకులు యాత్రకు విరామం ప్రకటించారు.

ఈ క్రమంలో ఇవాళ ఉదయం రూరల్ ఎమ్మెల్యే కొత్తూరు నుంచి అంబాపురం వెళ్లే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మార్గమధ్యలో అమరావతి మహా పాదయాత్ర చేస్తున్న రైతులను ఎమ్మెల్యే కోటంరెడ్డి కలవడం హాట్‌టాపిక్‌ అయ్యింది.

Shilpa

Shilpa

Next Story