ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ లేఖ

ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ లేఖ
x
Highlights

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లేఖ రాశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం...

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లేఖ రాశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. తనపై తీసుకున్న చర్యను ఉపసంహరించుకోవాలన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్. ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఎవరు పోటీకి దిగినా.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని రమేష్ హెచ్చరించారు. పెడనలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీడియో ఆధారాలు ఉండడంతో ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories