చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాల్సిందే.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాల్సిందే.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
x

అంబటి రాంబాబు ఫైల్ ఫోటో

Highlights

పట్టాభిపై దాడి, అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు వ్యాఖ‌్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

పట్టాభిపై దాడి, అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు వ్యాఖ‌్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తప్పుచేస్తే చంద్రబాబునైనా అరెస్ట్ చేస్తారని అన్నారు. చిన్న దాడికి ఇంత రాద్ధాంతం అవసరమా అంటూ సెటైర్లు వేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా... చంద్రబాబుకు ఇంకా బుద్దిరాలేదన్నారు అంబటి.

తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికలు రాగానే కొత్త నాటకాన్ని తెరతీసే ప్రయత్నాలు చేశాయని అంబటి రాంబాబు విమర్శించారు. దేశంపై దాడి అంటూ ఎత్తుకున్నారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందనే వాదన ఎత్తుకున్నారు. అచ్చెన్నాయుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు..? కచ్చితంగా నేరానికి పాల్పడ్డారనే అరెస్ట్ చేశారన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ సొంత అన్న కుమారుడిపైనే బెదిరింపులు దిగితే అరెస్ట్ చేయరా' అని అంబటి వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు హోంమంత్రి అయ్యి పోలీసుల తాట తీస్తాడట.. పాపం అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఓ ప్రధానిలా, అచ్చెన్నాయుడు హోంమంత్రిలా... నిమ్మగడ్డ పంచాయతీ మంత్రిలా పగటి కలలు కంటున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

పట్టాభిపై దాడి జరిగిందని, ఇప్పుడు కూడా కారే ధ్వంసం అవుతుందా.. దాడి ఎవరి మీద జరిగినా ఖండించాల్సిందేనన్నారు. చిన్న దాడి జరిగితే చంపేస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, బాబు చచ్చిన పాము.. ఇక ఆయనను చంపేంత పిచోల్లం కాదని అంబటి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్ పై కూగా అంబటి విమర్శలుగుప్పించారు. గొల్లలపెంటలోని ఆత్మహత్య సంఘటన బాధితులను ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. నారా లోకేష్‌కు పైలెట్‌గా వెళ్లారా అని నిలదీశారు. నిమ్మగడ్డకు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఉంది.. కాని నిమ్మగడ్డ అక్కడకు ఎందుకు వెళ్లారని అంబటి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories