Tadipatri: టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జునపై వైసీపీ నేతల దాడి

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Jun 2022 11:31 AM IST
YCP Leaders Attack on TDP Counselor in Tadipatri
X

Tadipatri: టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జునపై వైసీపీ నేతల దాడి..

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నంద్యాల రోడ్‌లో డ్రైనేజీ పనుల వద్ద టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ కౌన్సిలర్‌ మల్లికార్జునపై వైసీపీ నేతలు దాడి చేశారు. దాడి ఘటనను చిత్రీకరిస్తున్న విలేకర్లపైనా దౌర్జన్యానికి దిగారు. దాడి ఘటనపై టీడీపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. డ్రైనేజీ పైపులు బ్లాక్‌ కావడంతో నీరు కలుషితం అవుతోందని, పనులు చేయించేందుకు వస్తే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పనులు పర్యవేక్షించే అధికారం కౌన్సిలర్‌లకు ఉందంటున్నారు. తాడిపత్రిలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఫైర్‌ అయ్యారు టీడీపీ నేతలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story