Srikanth Reddy: చంద్రబాబుకు సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy: టీడీపీ సభ్యులందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి

Rama Rao
Published on: 25 March 2022 5:32 PM IST
YCP Leader Srikanth Reddy challenged Chandrababu | AP News Today
X

చంద్రబాబుకు సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వం మంచి చేయాలేదని చంద్రబాబు అనిపిస్తే తన సభ్యులతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విజయవంతం అయ్యిందన్నారు. సభలో తెలుగుదేశం పార్టీ తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందని గవర్నర్ ను అగౌరపర్చే కార్యక్రమాలన్నీ టీడీపీ నేతలు చేశారని మండిపడ్డారు. సభలో టీడీపీ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెబుతుంటే ప్రజల్లో వారు చులకన అవుతారని చర్చ జరగకుండా గందరగోళం సృష్టించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వానికి.. వైసీపీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story